సమస్యలను సవాలుగా తీసుకోవాలి ...
గెలవటాన్నిఒక అలవాటుగా చేసుకోవాలి ...
నిన్ను పడద్రోసిన ఆ చేతులే నీకు చప్పట్లు కొట్టాలి ...
నిన్ను అసహ్యించుకొన్న ఆ హృదయమే నీకు స్వాగతం కావాలి ...
జీవితమనే పరుగుపందెంలో పడటం తప్పు కాదు ...
పడినప్పుడు లేచి ... నీ కన్నీళ్లను దాచి ... చివరికంతా నిలిచి ... గెలవటం గొప్ప ...
ఒక లక్ష్యం ఉండాలి ... ఒక గమ్యం తప్పక ఉంటుంది ...
ఇక యుద్ధం చేయాలి ... విజయం తప్పక నిన్ను వరిస్తుంది ...
లక్ష మైళ్ళ ప్రయాణం ... ఒక్క అడుగుతోనే మొదలౌతుంది ...
లక్ష్యమైనా చిన్నదవుతుంది ... నీ ప్రయత్నంతోనే మరి అది నిజమౌతుంది ...
ఓటమి చిరునామా 'నిన్న' కావాలి ...
విజయానికి చిరునామా మాత్రం ఇక ఎప్పటికీ 'నువ్వు ' కావాలి ...
- సూర్య



No comments:
Post a Comment