Sunday, 6 December 2009

ఇచ్చిన మాటకోసం ...

ఇచ్చిన మాటకోసం ...
నమ్మిన మనిషి కోసం ...
- నీ జీవితం లోని ప్రతి క్షణాన్ని కరగించు ...
- ఆ పోరాటంలో నీవు ఓడినా గెలుపు నీదేనని మరువకు ...
- సూర్య

రేపటి జ్ఞాపకం ...

ఈనాడు రేపటి జ్ఞాపకం అవుతుంది ...
కానీ ... ఆ జ్ఞాపకం తీయగా ఉండాలంటే మాత్రం
- నీవిప్పుడు ప్రతి క్షణం జ్వలించక తప్పదు ...
- సూర్య

అలల తాకిడికి భయపడితే ...

అలల తాకిడికి భయపడితే ...
- మరి అది కడలి ఎలా అవుతుంది ...
చిరు కష్టాలకే చెదిరిపోతే ...
- మరి నీవు 'మనీషి' వెలా అవుతావు ...
- సూర్య

నిన్ను నమ్మినవారి నమ్మకం నిలిపేందుకు ...

నిన్ను నమ్మినవారి నమ్మకం నిలిపేందుకు
- దేనినైనా పణంగా పెట్టటానికి సిద్దంగా ఉండు ...
- చివరికి నిన్ను నీవు కోల్పోవలసి వచ్చినా సరే ...
- సూర్య

ప్రపంచాన్ని జయించిన మానవుడా ...

ప్రపంచాన్ని జయించిన మానవుడా ...
'మృత్యువు' పేరు వినగానే అలా పరిగెడతావేమిటి ?
- సూర్య

దేనికోసం నీ ఈ సుదీర్ఘ అన్వేషణ ...

ఓ మనిషీ ...
దేనికోసం నీ ఈ సుదీర్ఘ అన్వేషణ ...
- నీవు వచ్చేటప్పుడు నీ వెంట ఏమైనా తెస్తే కదా ...
ఇక్కడ పోగొట్టుకోవడం అనేది జరగటానికి ...
- సూర్య

మట్టే కదా అని ...

మట్టే కదా అని అపహాస్యం చేయకు ...
నీవు ఆకాశమంత ఎదిగినా -
నీ కాళ్ళు మాత్రం ఉండేది ఆ మట్టి పైనేనని తెలుసుకో ...
- సూర్య

స్వచ్చతే నిన్ను నిన్నుగా నిలుపుతుందని ...

ప్రేమిస్తున్నానని ఎదుటివారిని నమ్మించేశానని సంబరపడిపోకు ...
వారూ , తాము నమ్మేశామని నిన్ను నమ్మించి ఉండవచ్చు ...
స్వచ్చతే నిన్ను నిన్నుగా నిలుపుతుందని తెలుసుకో ...
- సూర్య