అనగనగా ఒక చీమ ...
దానికి ఉన్నట్టుండీ పుట్టిందండి ప్రేమ ...
... ఏకంగా సింహం దగ్గరికే వెళ్లి చెప్పిందండీ
నిన్ను ప్రేమించాననీ ... నువ్వు లేకుంటే బ్రతకలేనని ... ఈ బ్రతుకు లేదనీ ...
అంతవరకూ ... ఏదో విషాదంలో ఉన్న ఆ సింహం ...
... పక పకా నవ్వింది ... పడి పడీ నవ్వింది ... పగలబడి నవ్వింది ... ఆ అడవి దద్దరిల్లేలా నవ్వింది ...
అంతే ...
ప్రతి పక్షీ ... ప్రతి ప్రాణి ... చెట్టు పుట్టా ... పారే సెలయేరు అన్నీ నవ్వాయి ...
నవ్వుల వర్షమే అక్కడ కురిసింది ...
చీమ అప్పుడు చెప్పింది ...
మిత్రమా ... నువ్వేదో విషాదంగా ఉన్నావని ... దిగాలుగా కూర్చున్నావని నిన్ను నవ్విద్దామని నేనిలా చేసానని ...
ఇంకా చెప్పింది ...
ఏడుస్తూ కూర్చుంటే నీవు ఒంటరివి ...
నువ్వు నవ్వుతుంటే ఈ ఆడవే నీకు జంటనీ ...
సింహం చీమను తన మిత్రుడుగా చేసుకొంది ...
తనపై ఎక్కించుకుని ఆ అడవంతా తిప్పింది ...
ఇకపై ... తనకేమైనా సమస్య వచ్చినప్పుడల్లా ... సింహమేమో చీమను తలచుకొని నవ్వేది ...
... ఆ అడవేమో సింహాన్ని తల్చుకు నవ్వేది ...
ఇప్పుడు చెప్పండి ... మనం చీమలమా లేక సింహాలమా ...
సమస్యలు చీమలకూ ఉంటాయి ... సింహాలకూ ఉంటాయి ... మనకూ ఉంటాయి...
బహుశా ... సమస్యలకూ సమస్యలు ఉంటాయేమో ...
అందుకే ... నవ్వుతూ నవ్విస్తూ ...
... మన పయనం సాగాలి ...
... మనం గమ్యం చేరాలి ...
- సూర్య
Wednesday, 17 June 2009
నవ్వు ... నవ్వించు ...
లేబుళ్లు:
అనగనగా ఒక చీమ ...,
నవ్వు ... నవ్వించు ...,
సూర్య
Subscribe to:
Post Comments (Atom)



No comments:
Post a Comment