నేస్తమా ...
నీకు సంతోషం కలిగినప్పుడు నిన్ను నవ్విస్తాను ...
నీకు భాద మిగిలినప్పుడు నేను ఏడుస్తాను ...
చిటికెడంత ప్రేమను నాపై చూపితే ... సముద్రమంత ప్రేమను నీకిస్తాను ...
చురకత్తులతో నన్ను నిలువెల్లా గాయపరిచినా సరే నీ వెనకే నే వస్తాను ...
ఇంతకు నేనెవరో నీకు తెలుసా ...
ప్రణయాన్ని ... ప్రళయాన్ని ... నీ హృదయాన్ని ...
నీతో పుట్టుతాను ... నీలో పెరుగుతాను ... నీ తరువాత నీ 'జ్ఞాపకం' గా ఇక్కడిక్కడే తిరుగుతాను ...
నిన్ను అభిమానించే హృదయాల్లో ... నీవుగా మిగులుతాను ...
నేస్తం ... నేను నీ 'హృదయాన్ని' ... నీ జ్ఞాపకాన్ని ...
- సూర్య
Friday, 5 June 2009
Subscribe to:
Post Comments (Atom)



No comments:
Post a Comment