Monday, 28 September 2009

దగ్గరలో ఉన్నప్పుడు ...

కొన్నింటి విలువను మనం దగ్గరలో ఉన్నప్పుడు తెలుసుకోలేం ...
దూరమైన తరువాత ... కావాలనుకున్నా ఇక ఎప్పటికీ చేరుకోలేం ...
- సూర్య

ప్రతిఫలాన్ని ఆశించడంలో ...

ప్రతిఫలాన్ని ఆశించడంలో తప్పు లేదు ...
కానీ ... ప్రతి ఫలం నీకే చెందాలనుకోవడం మాత్రం తప్పు ...
- సూర్య

తెలియక చేసింది ...

తెలియక చేసింది తప్పు కాదు ... పొరపాటు ...
కానీ ... అదే తప్పును పదేపదే చేయడం మాత్రం తప్పవుతుంది ...
- సూర్య

Sunday, 27 September 2009

అణు యుద్దాలకంటే ...

అణు యుద్దాలకంటే ...
మనిషిలోని స్వార్ధం , ద్వేషం , ఈర్ష , అసూయల వలననే ... ఈ ప్రపంచం చివరికి అంతం అవుతుంది ...
- సూర్య

నీవు కోరుకొనే విజయానికి ...

నిర్లక్ష్యం , బద్ధకం , అపనమ్మకం , అధైర్యం - మిత్రువులు ...
కానీ ... నీవు కోరుకొనే విజయానికి మొదటి శత్రువులు ...
- సూర్య

తనకు వచ్చిన కష్టాలు ...

'తనకు వచ్చిన కష్టాలు ఈ ప్రపంచంలో మరెవ్వరికి వచ్చినా తట్టుకోలేరనే '
భావనను ఈ ప్రపంచంలోని ప్రతి మనిషి దాదాపు ఏదో ఒక సందర్భంలో వ్యక్తపరుస్తారు ...
- సూర్య

Tuesday, 15 September 2009

ఆ 'నమ్మకం' పేరే ...

ఈ ప్రపంచాన్ని ఏదో అద్బుత శక్తి నడిపిస్తోంది ...
ఆ 'నమ్మకం' పేరే 'దైవం' ...
- సూర్య

'మంచి' , 'చెడు' లు ...

మంచిని ప్రేమించు ... చెడును ద్వేషించు ...
'మంచి' , 'చెడు' లు మనలో ఉండే గుణాలు మాత్రమేనని గుర్తుంచుకో ...
- సూర్య

నిప్పును ఎవరు అంటించారనేది ...

నిప్పును ఎవరు అంటించారనేది ఇప్పుడు ముఖ్యం కాదు ...
... దానిని ఆర్పివేసిన తరువాత మాత్రమే ఆలోచించవలసిన విషయం అది
- సూర్య

Monday, 14 September 2009

మనిషిని బట్టే పరిస్థితులను ...

పరిస్థితులను బట్టి మనిషిని కాదు ...
మనిషిని బట్టే పరిస్థితులను అంచనా వేయాలి ...
- సూర్య

'సహనం' బ్రద్దలైన రోజు ...

'ఆవేశం' విలువ కేవలం ఒక్క 'ఆవేశమే' ...
కానీ ... 'సహనం' బ్రద్దలైన రోజు దాని విలువ కొన్ని వేల 'ఆవేశాల'వుతుంది ...
- సూర్య

'మాట' ప్రాణాల్ని సైతం ...

కత్తి కేవలం గాయాన్ని మాత్రమే చేస్తుంది ...
'మాట' ప్రాణాల్ని సైతం తీస్తుంది ...
- సూర్య