Monday, 22 June 2009

విజయానిKEY...

సమస్యలను సవాలుగా తీసుకోవాలి ...

గెలవటాన్నిఒక అలవాటుగా చేసుకోవాలి ...

నిన్ను పడద్రోసిన ఆ చేతులే నీకు చప్పట్లు కొట్టాలి ...

నిన్ను అసహ్యించుకొన్న ఆ హృదయమే నీకు స్వాగతం కావాలి ...

జీవితమనే పరుగుపందెంలో పడటం తప్పు కాదు ...

పడినప్పుడు లేచి ... నీ కన్నీళ్లను దాచి ... చివరికంతా నిలిచి ... గెలవటం గొప్ప ...

ఒక లక్ష్యం ఉండాలి ... ఒక గమ్యం తప్పక ఉంటుంది ...

ఇక యుద్ధం చేయాలి ... విజయం తప్పక నిన్ను వరిస్తుంది ...

లక్ష మైళ్ళ ప్రయాణం ... ఒక్క అడుగుతోనే మొదలౌతుంది ...

లక్ష్యమైనా చిన్నదవుతుంది ... నీ ప్రయత్నంతోనే మరి అది నిజమౌతుంది ...

ఓటమి చిరునామా 'నిన్న' కావాలి ...

విజయానికి చిరునామా మాత్రం ఇక ఎప్పటికీ 'నువ్వు ' కావాలి ...

- సూర్య

Wednesday, 17 June 2009

నవ్వు ... నవ్వించు ...

అనగనగా ఒక చీమ ...
దానికి ఉన్నట్టుండీ పుట్టిందండి ప్రేమ ...
... ఏకంగా సింహం దగ్గరికే వెళ్లి చెప్పిందండీ
నిన్ను ప్రేమించాననీ ... నువ్వు లేకుంటే బ్రతకలేనని ... ఈ బ్రతుకు లేదనీ ...
అంతవరకూ ... ఏదో విషాదంలో ఉన్న ఆ సింహం ...
... పక పకా నవ్వింది ... పడి పడీ నవ్వింది ... పగలబడి నవ్వింది ... ఆ అడవి దద్దరిల్లేలా నవ్వింది ...
అంతే ...
ప్రతి పక్షీ ... ప్రతి ప్రాణి ... చెట్టు పుట్టా ... పారే సెలయేరు అన్నీ నవ్వాయి ...
నవ్వుల వర్షమే అక్కడ కురిసింది ...
చీమ అప్పుడు చెప్పింది ...
మిత్రమా ... నువ్వేదో విషాదంగా ఉన్నావని ... దిగాలుగా కూర్చున్నావని నిన్ను నవ్విద్దామని నేనిలా చేసానని ...
ఇంకా చెప్పింది ...
ఏడుస్తూ కూర్చుంటే నీవు ఒంటరివి ...
నువ్వు నవ్వుతుంటే ఈ ఆడవే నీకు జంటనీ ...
సింహం చీమను తన మిత్రుడుగా చేసుకొంది ...
తనపై ఎక్కించుకుని ఆ అడవంతా తిప్పింది ...
ఇకపై ... తనకేమైనా సమస్య వచ్చినప్పుడల్లా ... సింహమేమో చీమను తలచుకొని నవ్వేది ...
... ఆ అడవేమో సింహాన్ని తల్చుకు నవ్వేది ...
ఇప్పుడు చెప్పండి ... మనం చీమలమా లేక సింహాలమా ...
సమస్యలు చీమలకూ ఉంటాయి ... సింహాలకూ ఉంటాయి ... మనకూ ఉంటాయి...
బహుశా ... సమస్యలకూ సమస్యలు ఉంటాయేమో ...
అందుకే ... నవ్వుతూ నవ్విస్తూ ...
... మన పయనం సాగాలి ...
... మనం గమ్యం చేరాలి ...

- సూర్య

స్నే 'హమ్' ...

నేస్తం ...
నీతో నడిచిన ...
నీతో గడిపిన ... ప్రతి క్షణం ...
... నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని ఒక అందమైన జ్ఞాపకం
... నా హృదయాన్ని ఎప్పటికీ విడిచిపోలేని ఒక పరిమళం
జ్ఞాపకాల పూలతోటలో మనస్సు ఇంద్రధనస్సు అయినప్పుడు ...
నీ స్నేహం నాకు త్రోవ చూపుతుంది వెలుగు వేకువై ఎప్పుడూ ...
- సూర్య

Thursday, 11 June 2009

మరచిపో రాధిక ...

" నిన్ను విడచిపోతున్న ఈ క్షణం ... నీ కోసం ఎప్పటికీ రాధిక ...
అందుకే ఈ క్షణాన్నే మదిలో పదిలంగా దాచుకో ... మరచిపోరాధిక ..."
" నిన్ను విడచిపోతున్న ఈ క్షణం ... నీ కోసం ఎప్పటికీ రాధిక ...
అందుకే ఈ క్షణాన్నే మదిలో పదిలంగా దాచుకో ... మరచిపో రాధిక ..."
ఒక్క అక్షరం ... ఒక్క క్షణం ...
నువ్వు , నేనూ ... ఇలా ... నిన్న ... నేడులా...
జ్ఞాపకాల అద్దంలో చూసినప్పుడల్లా ... నాకు నువ్వే గుర్తొస్తావు ...
గాయపడిన ఈ హృదయంలో ... చిరునవ్వై నన్ను నడిపిస్తావు ...

- సూర్య

హృ 'దయ' o

" ఒక ఊరిలో ... అకస్మాత్తుగా ఒక వ్యక్తికి పశు లక్షణాలు వచ్చాయి ... గడ్డి తినటం , కుడితి తాగటం మొదలుపెట్టాడు ... ఆ ఊరిలో అందరూ కలిసి అతనిని చంపివేశారు ... కొన్ని రోజుల తర్వాత ... ఆ ఊరిలో అందరికీ ఆ లక్షణాలు వచ్చాయి ... అందరూ గడ్డి తినటం , కుడితి తాగటం మొదలు పెట్టారు ... ఒక వ్యక్తికి తప్ప ... అంతే ... అందరూ కలిసి ఆ వ్యక్తిని చంపేశారు "
మనుషుల క్రూరత్వానికిదో ఉదాహరణ మాత్రమే ...
ప్రతి మనిషిలో హృదయం ఉంటుంది ... హృ 'దయ' o...లో దయ ఉంటుంది ... దానితో సాటి మనిషికి సహాయం చేద్దాం ...
మానవత్వంతో మానవ సంబంధాలను పునర్నిర్మిద్దాం ...

- సూర్య

Saturday, 6 June 2009

చిరునవ్వుతో...

" పుట్టినప్పుడు ...

నువ్వేడుస్తూ ... అందర్నీ నవ్విస్తావు ...

గిట్టినప్పుడు

అందరూ ఏడుస్తున్నా...

నువ్వు మాత్రం ... హాయిగా మృత్యువుతో నవ్వుకొంటూ వెల్లిపోతావ్...

ఇదే జీవితం "

నిజం ... చిరునవ్వు జీవితమంతా ప్రతి క్షణం మనతోనే ఉన్నా ... మనలోనే ఉన్నా ... మన చుట్టూనే ఉన్నా...

మనం మాత్రం ... ఏ క్షణమూ చిరునవ్వుతో ఉండము...

మనలోనేఎ మనం భాధ పడుతూ ... మనల్ని మనమేఎ భాధ పెట్టుకొంటూ ... మన చుట్టూ ఉన్నవారిని భాధ పెడుతూ ... చివరికి ... మన నుంచి మనమేఎ దూరం అవుతూ ఉన్నాము...

అందుకేఎ ...

చిరునవ్వుతో... మన హృదయాల్ని నింపాలి ...

చిరునవ్వుతో ... మన ఉదయఆల్ని ప్రారంభించాలి ...

చిరునవ్వుతో ... స్నేహం చేయాలి చిరునవ్వుతో ...

- సూర్య

ఆకాశమంత ...

" సమస్య పెద్దదైనా... సమాధానం చిన్నదే...
క్షణం చిన్నదైనా ... ఎన్నో కాలలని కన్నదే...
అందుకే ...
చిన్నే పెద్దకు కోలమానమని మరిచి ఎవరినీ చిన్న చూపు చూడకు"

మనం ఆకాశమంత ఎత్తు ఎదిగినా మన కాళ్ళు మాత్రం భూమి మీదే ఉంటాయని మరవద్దు ... ఈ రోజున నీకు ఎవరి సహాయం అవసరం లేదని , నిన్ను ఇంత ఎత్తుకు చేర్చిన ఆ చేతిని మాత్రం ఎప్పటికీ విడువద్దు ...

- సూర్య

క్షణాలిక జ్వలిస్తాయీ ...

" క్షణాలిక జ్వలిస్తాయీ ...
నీ జ్ఞాపకాలిక ఎప్పటికీ నన్ను భాదిస్తాయీ ...
నిన్ను వదలి దూరంగా ... నా మనసు భారంగా చేయబోయే ఈ పయనం ...
ఎప్పటికైనా తెలుసుకుంటూంద .... మరి నీ హృదయం ...
మలి సూర్య కిరణంలో ...
విడిపోయే తరుణంలో ...
నిశబ్ద భరితంలో ...
ఆనంద కెరటం ... కన రాదు ... అది చేదు ..."
- సూర్య

Friday, 5 June 2009

హృదయం ...

నేస్తమా ...
నీకు సంతోషం కలిగినప్పుడు నిన్ను నవ్విస్తాను ...
నీకు భాద మిగిలినప్పుడు నేను ఏడుస్తాను ...
చిటికెడంత ప్రేమను నాపై చూపితే ... సముద్రమంత ప్రేమను నీకిస్తాను ...
చురకత్తులతో నన్ను నిలువెల్లా గాయపరిచినా సరే నీ వెనకే నే వస్తాను ...
ఇంతకు నేనెవరో నీకు తెలుసా ...
ప్రణయాన్ని ... ప్రళయాన్ని ... నీ హృదయాన్ని ...
నీతో పుట్టుతాను ... నీలో పెరుగుతాను ... నీ తరువాత నీ 'జ్ఞాపకం' గా ఇక్కడిక్కడే తిరుగుతాను ...
నిన్ను అభిమానించే హృదయాల్లో ... నీవుగా మిగులుతాను ...
నేస్తం ... నేను నీ 'హృదయాన్ని' ... నీ జ్ఞాపకాన్ని ...

- సూర్య

Thursday, 4 June 2009

FROM MY HEART...

"Love a Heart
that hurts you...
but...never hurt a Heart that loves you...
because...
for the world...you may be someone...
but for someone...you may be the world..."
- SURYA