Sunday 18 September, 2016

గాయపడిన హృదయం సాక్షిగా ...

నిన్ను మరచిపోవడానికి ప్రయత్నించిన ప్రతిక్షణం 
మరో వేయిసార్లు నిన్ను మళ్ళీ  నాకు గుర్తు చేస్తుంది ... 
తీరం నుంచి ఎంత దూరం పరిగెత్తినా, మరుక్షణం 
సముద్రం ఎదురుగా నిలిచి మరీ నన్ను పలకరిస్తుంది ... 
కళ్ళని, కన్నీళ్లను సృష్టించిన విధాత తానే సృష్టించిన హృదయాన్ని మాత్రం ఎలా మరిచాడో ... 
ఇప్పుడే విచ్చుకున్న చిన్ని కళ్ళనీ, అందులోని అందమైన కలల్నీ కొండ అంచుపైనుంచి మరి కిందకి కర్కశంగా ఎలా విడిచాడో ... 
నా కళ్ళలోంచి కన్నీటి వర్షం కురుస్తున్నా ఈ గుండె మంట అరదెందుకో ... 
అనుబంధాలు అను బంధాల్ని తెంపేసినా కాలం ఆకలి ఇంకా తీరదెందుకో ... 
గాయపడిన హృదయం సాక్షిగా నేనో క్షతగాత్రుడను ... 
జ్ఞాపకాలుతున్న ఈ పూలతోటలో ఓ క్షణమాత్రుడను ... 
                                                                                    - సూర్య 

Wednesday 19 February, 2014

అద్బుతం అనేది ...

అద్బుతం అనేది అసాధ్యం నది అవతల ఉంటుంది ... ఎవరైతే ఎదురీదగలరో వారికే అది దక్కుతుంది ... సూర్య 

తుది వీడ్కోలుకు తొలి ఆహ్వానం ...

మృత్యువు  అంటే  ... తుది  వీడ్కోలుకు తొలి ఆహ్వానం ... అస్తమిస్తున్న సూర్యుడికి రేపు రానవసరం లేదని పంపించే ఆఖరి సందేశం ... సూర్య 

Saturday 21 May, 2011

గెలవటాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలి ...

సమస్యలను సవాలుగా తీసుకోవాలి ...
గెలవటాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలి ...
                                                   - సూర్య  
                                                 

 

Sunday 12 December, 2010

నిరంతర పరిశీలనతోనే ...

ఎప్పటికీ మంచి వారు ఉండరు ...
ఎప్పటికీ చెడ్డవారు ఉండరు ...
నిరంతర పరిశీలనతోనే ఎదుటివ్యక్తిని చదవటానికి ప్రయత్నించాలి ...
                                                                                - సూర్య

ఈ యాంత్రిక జీవన ప్రయాణంలో ...

ఈ యాంత్రిక జీవన ప్రయాణంలో మనకు సంతృప్తి ఇచ్చేవి ...
మనలో ఎక్కడో మిగిలి ఉన్న 'అనుభంధాలు' మాత్రమే ...
                                                           - సూర్య

గెలిచిన వ్యక్తికి ...

గెలిచిన వ్యక్తికి ఓడావు అని చెప్పవచ్చు ...
కానీ ... ఓడిన వ్యక్తికి ఎప్పుడూ గెలిచావు అని చెప్పకూడదు ...
                                                                      - సూర్య

Tuesday 26 January, 2010

నేను నీ హృదయాన్ని ...

నేస్తమా ...
- నీ సంతోషంలో నీతో వస్తా ...
- నీ దుఃఖంలో నేనే తడుస్తా ...
నిరాశా చీకట్లు నీ చుట్టూ కమ్ముకొన్నప్పుడు నిప్పునై నీ దరికి వెలుగులు తెస్తాను ...
చిరుగాలైనా నిను నొప్పించాలని చూసినా ఇక ఉప్పెనే నేనై పరుగులు తీస్తాను ...
నేను నీ పెదవులపై మెరిసే చిరునవ్వును ...
నేను నీ కనుల చివరినుంచి కురిసే కన్నీటి చుక్కను ...
నేను నీ హృదయాన్ని ...
- నీ ఆశే నా శ్వాసగా నే జీవిస్తా ...
- గెలుపులోనే కాదు నీ జీవితపు ప్రతి మలుపులోనూ నీ తోడై నే వస్తా ...
నీవు కలతపడి ఉన్నప్పుడు నిద్రలోసైతం నిను ఓదార్చే కలై వస్తాను ...
ఒంటరివై సముద్రపు ఒడ్డున కూర్చున్నపుడు ఒక అలై నిన్ను పలకరిస్తాను ...
నేను నీలో ఆశలు రేపే రేపటి ఉదయాన్ని ...
నేను నీ భుజం తట్టి నిన్ను ముందుకు నడిపించే ఓ నిజమైన నేస్తాన్ని ...
నేను నీ హృదయాన్ని ...
- నేను నీ అడుగులో అడుగేస్తూ వస్తా
-వెలుగులోనే కాదు చీకటిలోనూ నీ చేయి పట్టుకు నిన్ను ముందుకు నడిపిస్తా ...
నీతో పుడతాను , నీలో పెరుగుతాను , ప్రతి క్షణం నీతోనే పయనిస్తాను ...
నీ తరువాత నిన్ను ప్రేమించే వారి హృదయాల్లో నీ జ్ఞాపకంగా నిలుస్తాను ...
నేను నీకు తల్లిని , తండ్రిని , గురువుని , నీ జీవితాన్ని ...
నేను నీకు ప్రేమను , స్నేహాన్ని , త్యాగాన్ని , నీ స్వగతాన్ని ...
నేను నీ హృదయాన్ని ...
- సూర్య

Sunday 6 December, 2009

ఇచ్చిన మాటకోసం ...

ఇచ్చిన మాటకోసం ...
నమ్మిన మనిషి కోసం ...
- నీ జీవితం లోని ప్రతి క్షణాన్ని కరగించు ...
- పోరాటంలో నీవు ఓడినా గెలుపు నీదేనని మరువకు ...
- సూర్య

రేపటి జ్ఞాపకం ...

ఈనాడు రేపటి జ్ఞాపకం అవుతుంది ...
కానీ ... జ్ఞాపకం తీయగా ఉండాలంటే మాత్రం
- నీవిప్పుడు ప్రతి క్షణం జ్వలించక తప్పదు ...
- సూర్య

అలల తాకిడికి భయపడితే ...

అలల తాకిడికి భయపడితే ...
- మరి అది కడలి ఎలా అవుతుంది ...
చిరు కష్టాలకే చెదిరిపోతే ...
- మరి నీవు 'మనీషి' వెలా అవుతావు ...
- సూర్య

నిన్ను నమ్మినవారి నమ్మకం నిలిపేందుకు ...

నిన్ను నమ్మినవారి నమ్మకం నిలిపేందుకు
- దేనినైనా పణంగా పెట్టటానికి సిద్దంగా ఉండు ...
- చివరికి నిన్ను నీవు కోల్పోవలసి వచ్చినా సరే ...
- సూర్య

ప్రపంచాన్ని జయించిన మానవుడా ...

ప్రపంచాన్ని జయించిన మానవుడా ...
'మృత్యువు' పేరు వినగానే అలా పరిగెడతావేమిటి ?
- సూర్య

దేనికోసం నీ ఈ సుదీర్ఘ అన్వేషణ ...

మనిషీ ...
దేనికోసం నీ సుదీర్ఘ అన్వేషణ ...
- నీవు వచ్చేటప్పుడు నీ వెంట ఏమైనా తెస్తే కదా ...
ఇక్కడ పోగొట్టుకోవడం అనేది జరగటానికి ...
- సూర్య

మట్టే కదా అని ...

మట్టే కదా అని అపహాస్యం చేయకు ...
నీవు ఆకాశమంత ఎదిగినా -
నీ కాళ్ళు మాత్రం ఉండేది మట్టి పైనేనని తెలుసుకో ...
- సూర్య

స్వచ్చతే నిన్ను నిన్నుగా నిలుపుతుందని ...

ప్రేమిస్తున్నానని ఎదుటివారిని నమ్మించేశానని సంబరపడిపోకు ...
వారూ , తాము నమ్మేశామని నిన్ను నమ్మించి ఉండవచ్చు ...
స్వచ్చతే నిన్ను నిన్నుగా నిలుపుతుందని తెలుసుకో ...
- సూర్య

Friday 20 November, 2009

నీవు నడిచే మార్గం ...

నీవు ఎవర్నుంచైతే తప్పించుకు పోవాలని చూస్తావో
నీకు తెలియకుండానే అప్రయత్నంగా వారి మార్గంలోనే నీవూ నడుస్తావు ...
- సూర్య

నమ్మకం ...

ఎదుటి వ్యక్తిపై మనం చూపించే ప్రగాడమైన నమ్మకం
అతనిని మనకు సన్నిహితునిగా చేస్తుంది ...
- సూర్య